విడుదల తేదీ : 01 మార్చి 2013 TeluguWorld.wap.sh : 3.0/5 దర్శకుడు : దేవీ ప్రసాద్ నిర్మాత : ఎన్.వి ప్రసాద్, పరాస్ జైన్ సంగీతం : ఎస్.ఎ రాజ్ కుమార్ నటీనటులు : సునీల్, ఇషాచావ్లా, ఆలీ..
కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్న సునీల్ ‘పూలరంగడు’ సినిమా తర్వాత ఒక సంవత్సరం టైం తీసుకొని మళ్ళీ ‘Mr. పెళ్ళికొడుకు’ సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ఇషాచావ్లా రెండవసారి సునీల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిందీలో హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ సినిమాకి రీమేక్. ఈ కథని మన నేటివిటీకి తగ్గట్టు మార్చి దేవీ ప్రసాద్ దర్శకత్వం చేసాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు. నిన్న(ఫిబ్రవరి 28) రాత్రి హైదరాబాద్ సినిమాక్స్ లో వేసిన ప్రీమియర్ షోని తిలకించాము. సునీల్ ‘Mr. పెళ్ళికొడుకు’ గా ఎంతవరకూ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
బుచ్చిబాబు(సునీల్) ఒక ఎన్.అర్.ఐ. ఆరు సంవత్సరాల తరువాత ఇండియా వచ్చిన బుచ్చిబాబు తన అమ్మ నాన్న(ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తులసి)ల బలవంతంపై వాళ్ళు ఎన్నుకున్న కొంత మంది అమ్మాయిల లిస్టు నుండి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బుచ్చిబాబు మొదటి సారిగా షుగర్ సుబ్బరాజు(ఆహుతి ప్రసాద్) కూతురు అంజలి(ఇషాచావ్లా)ని పెళ్లిచూపులు చూడడానికి వెళ్తాడు. అంజలిని చూడగానే ప్రేమలో పడతాడు బుచ్చిబాబు. తను ఒప్పుకోవడం తో తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. కానీ అంజలి ఒక షాకింగ్ నిజాన్ని చెబుతుంది. తన వైల్డ్ గుణాన్ని చూపిస్తుంది. అది చూసి బుచ్చిబాబు భయపడి సంబంధాన్నివద్దంటాడు. తిరిగి అమ్మాయిలను వెతికే పనిలో వుంటాడు. కానీ తన మనసులో వున్న అంజలిని మర్చిపోలేక పోతాడు. కొద్ది రోజుల తరువాత బుచ్చిబాబు ఫ్రెండ్ నాయర్ కేరళలో పెళ్ళికి రమ్మని పిలుస్తాడు. అంజలి కూడా ఆ పెళ్ళికి వస్తుంది. మల్లి బుచ్చిబాబు గుండెలో ప్రేమ మొదలవుతుంది. అతని స్నేహితుడు బాచి(అలీ), బుచ్చిబాబు అంజలి మనసులో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మరి బుచ్చిబాబు అంజలి ప్రేమను పొందుతాడా లేదా అంజలి ఇంకెవరినైన పెళ్ళిచేసుకుంటుందా?, అంజలి ప్రేమ కోసం బుచ్చిబాబు చేసే ప్రయత్నాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో సునీల్ డాన్సులు అద్బుతంగా ఉన్నాయి(ఈ విషయాన్ని గుర్తుంచుకోండి). కొన్ని కామెడీ సన్నివేశాలు, సునీల్ జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు కామెడీగా ఉంటాయి. ఈ సినిమాలో ఇషాచావ్లా చాలా గ్లామరస్ గా చక్కని పాత్రని పోషించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది, తన నటన బాగుంది.
అలీ కొంత నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. రవిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్ పరవాలేదనిపించారు. మొదటి బాగంలో కొన్నికామెడీ సన్నివేశాలు మరియు సునీల్ – రవిబాబుల మద్య జరిగే పైట్ ని మనమందరం చాలా ఎంజాయ్ చేస్తాం.
సునీల్ పెళ్ళిచూపుల సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయి. ఇనుపరేకులు సీరియల్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
మైనస్ పాయింట్ :
సునీల్ ని కొంచం అందంగా చూపించే ప్రయత్నం చేసుంటే బాగుండేది. తన హెయిర్ స్టైల్, మేకప్, పింక్ లిప్ స్టిక్ తో చూడడానికి వికారంగా కనిపిస్తాడు. ఈ సినిమాలో కన్నా తన పాత సినిమాలైన ‘డీ’, ‘సొంతం’ ‘సంతోషం’,'మన్మధుడు’ల లోనే చాలా బాగున్నాడు.
కొన్ని పాటలలో డాన్స్ లు చాలా బాగున్నాయి, మరికొన్ని పాటలలోడాన్స్ లు బాగాలేకపోగా కామెడీగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో బెల్ట్ స్టెప్ నా ఓపికను పరీక్షించింది. సెకండ్ హాఫ్ లో పాటలు ఒకదాని తరువాత ఒకటి రావటంతో, అలాగే ఈ పాటలు ప్రేక్షకుల మదిని ఆకట్టుకోలేక పోతుండడంతో విసుగు పుడుతుంది. సెంటిమెంటల్ సీన్ లు అంతగా ఆకట్టుకోక పోగా, స్క్రిప్ట్ పరంగా చాల పేలవంగా వుంది, అలాగే వినబడి వినబడని డైలాగులు, ఆకట్టుకోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నవ్వు రాని కామెడీ ఈ సినిమాకి మైనస్. అవసరంలేని కొన్ని సన్నివేశాలను దీనిలో పెట్టడం, ఉదాహరణకి సునీల్ క్లైమాక్స్ పైట్ సునీల్ బాడీని చూపించడానికే పెట్టినట్టుగా ఉండటం పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.
‘తను వెడ్స్ మను’ సినిమాను మంచి కథ, మ్యూజిక్ తో నిర్మించారు. కానీ తెలుగులో ఆశించినంత బాగా రాలేదు.
సాంకేతిక విభాగం:
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి పరవాలేదు. నందమూరి హరి ఎడిటింగ్ అందరికీ నచ్చేవిదంగా చేయలేదు. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్. ఈ మ్యూజిక్ సినిమాకు ఎటువంటి బలాన్ని ఇవ్వలేదు. దేవీ ప్రసాద్ దర్శకత్వం బాగోలేదు. స్క్రీన్ ప్లే కుడా సెకండ్ హాఫ్ లో మాములుగా ఉంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో డైలాగులు బాగున్నాయి.
తీర్పు:
‘తను వెడ్స్ మను’ను రీమేక్ చేసే ప్రయత్నం అంతగా ఫలించలేదు. మ్యూజిక్ బాగాలేకపోవటం, సన్నివేశాలు సరిగా తీయకపోవడం, సునీల్ మేకప్ మరి ఎక్కువగా ఉండడం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఇషా చావ్లా గ్లామర్ మరియు ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు మాత్రమే బాగున్నాయి. ఈ సినిమాలో కన్నా ‘సొంతం’ సినిమాలోనే సునీల్ యాక్షన్ బాగుంది.